హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)
ట్యాంక్ బండపై గణేశ్ నిమర్జనం
ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ బలమురి వెంకట్, మేయర్ గద్వాల విజయ లక్ష్మీలతో కలిసి నేడు పరిశీలించారు. పోలీస్ భద్రత, విద్యుత్, శానిటేషన్, తాగునీరు తదితర అంశాలపై భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని వారు పరిశీలించారు. వినాయక నిమజ్జనంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, గత మూడు రోజులుగా జరుగుతున్న నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు