ఉగ్ర బెదిరింపుల నేపథ్యంలో ముంబై లో హై అలెర్ట్..
హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.) దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఉగ్ర బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. నగరంలో ఆత్మాహుతి బాంబు దాడికి ప్లాన్ చేసినట్లు బెదిరించారు. కోటి మంది లక్ష్యంగా ఈ దాడి జరుగుతుందని.. న
ముంబై హై అలర్ట్


హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)

దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఉగ్ర బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. నగరంలో ఆత్మాహుతి బాంబు దాడికి ప్లాన్ చేసినట్లు బెదిరించారు. కోటి మంది లక్ష్యంగా ఈ దాడి జరుగుతుందని.. నగరం మొత్తం దద్దరిల్లుతుందంటూ హెచ్చరించారు. ఈ బెదిరింపు కాల్ తో

అప్రమత్తమైన ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై ట్రాఫిక్ పోలీసు హెల్ప్ లైన్ నంబర్కు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. నగరం మొత్తం దద్దరిల్లేలా 34 వాహనాల్లో 400 కిలోల RDX పేలుడు పదార్థాలను సిద్ధం చేసినట్లు బెదిరించారు. అనంత చతుర్దశి సందర్భంగా దాదాపు కోటి మందిని చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ ఉగ్ర బెదిరింపులతో ముంబై పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పెంచినట్లు ముంబై పోలీసులు తెలిపారు. లష్కరే జిహాదీ అనే సంస్థ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande