వినాయక నిమజ్జనం నేపథ్యంలో రేపు ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా..
హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.) వినాయక నిమజ్జనం నేపథ్యంలో రేపు ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్ మెంట్ పరీక్షలతో పాటు బీఈడీ 2, 3వ పరీక్షలను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీలను త్వర
పరీక్షలు వాయిదా


హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)

వినాయక నిమజ్జనం నేపథ్యంలో రేపు

ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్ మెంట్ పరీక్షలతో పాటు బీఈడీ 2, 3వ పరీక్షలను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అంతే కాకుండా గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సెలవు వర్తించనుంది. రేపు సెలవు ఇవ్వడంతో అక్టోబర్ 2వ తేదీ శనివారం రోజున పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సాలార్ జంగ్ మ్యూజియంకు సైతం సెలవు ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande