సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం రైతుల ఆందోళన.. పోలీసుల మోహరింపు..
సూర్యాపేట, 5 సెప్టెంబర్ (హి.స.) సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామంలో గత అర్ధరాత్రి నుండి రైతులు యురియా కోసం పడి గాపులు కాస్తున్నారు. అంతసేపు వేచి ఉన్న యూరియా అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిబండ పీఎసీఎస్ పరిధిలో ఏడు గ్రామాలకు
యూరియా


సూర్యాపేట, 5 సెప్టెంబర్ (హి.స.) సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామంలో గత అర్ధరాత్రి నుండి రైతులు యురియా కోసం పడి గాపులు కాస్తున్నారు. అంతసేపు వేచి ఉన్న యూరియా అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిబండ పీఎసీఎస్ పరిధిలో ఏడు గ్రామాలకు కేవలం 277 బస్తాల యూరియా మాత్రమే రావడంతో రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతుకు ఒక యురియా బస్తా కూడా అందకపోవడంతో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూరియా లేక పంటలు పండే పరిస్థితి లేదని వాపోయారు. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యురియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande