పశువులను అక్రమంగా తరలిస్తున్న మూడు వాహనాలను పట్టుకున్న పోలీసులు..
ఆసిఫాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.) అక్రమంగా తరలిస్తున్న పశువులను శుక్రవారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమనేపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అటు
పశువుల వాహనాలు


ఆసిఫాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)

అక్రమంగా తరలిస్తున్న పశువులను

శుక్రవారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమనేపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న మూడు బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా.. వాటిలో సుమారు 20 పైగా పశువులు ఉన్నట్టు గమనించారు. కాగా ఇందులో 8 చనిపోయిన పశువులు ఉన్నట్టు వారు చెప్పారు. ఇక వాటికి సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వానాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande