హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)
రేపు శనివారం జరగబోయే గణేష్ శోభాయాత్ర రద్దీ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా నగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన శోభాయాత్ర కొనసాగే 19 కిలోమీటర్ల మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించే సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించే మార్గంలో ప్రయాణించి గమ్య స్థానాలకు సురక్షితంగా చేరాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కోరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు