పుట్టపర్తి/న్యూఢిల్లీ,5 సెప్టెంబర్ (హి.స.), 2040 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్‌ను చంద్ర మండలంలోకి విజయవంతంగా ప్రయోగిస్తామని, చంద్రుడిపై జాతీయ జెండాను పాతుతామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న కేరళ సంప్రదాయ ఓనం వేడుకల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు
8
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ