శిల్పాశెట్టి దంపతులపై లుకౌట్‌ నోటీసులు జారీ
ముంబయి/న్యూఢిల్లీ,06,సెప్టెంబర్ (హి.స.) ఆర్థిక మోసం కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై ముంబయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం లుకౌట్‌ నోటీసులు(ఎల్‌వోసీ) జారీ చేసింది. ఈ దంపతులు తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నోటీసులిచ్
శిల్పాశెట్టి


ముంబయి/న్యూఢిల్లీ,06,సెప్టెంబర్ (హి.స.) ఆర్థిక మోసం కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై ముంబయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం లుకౌట్‌ నోటీసులు(ఎల్‌వోసీ) జారీ చేసింది. ఈ దంపతులు తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నోటీసులిచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. 60 కోట్ల రుణానికి సంబంధించి ఓ వ్యాపారవేత్తను శిల్పా దంపతులు మోసం చేసినట్లు గతనెల 14న జుహూ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైందని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande