న్యూఢిల్లీ,06,సెప్టెంబర్ (హి.స.) పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆస్పత్రిలో చేరారు. గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పర్యటనకు రద్దు అయ్యింది.
కేబినెట్ సమావేశం వాయిదా..
పంజాబ్‌లో వరద పరిస్థితికి సంబంధించి ఈ సాయంత్రం చండీగఢ్‌లోని పంజాబ్ సీఎం హౌస్‌లో జరగనున్న ముఖ్యమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని సీఎం ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో వరదల గురించి చర్చించాల్సి ఉంది. ఆయన గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ