బెంగళూరు/న్యూఢిల్లీ,06,సెప్టెంబర్ (హి.స.) సెప్టెంబరు 5: ఈనెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువ సేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలవనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే 2018 జూలై 27 తర్వాత భారత్‌లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించడం ఇదే మొదటిసారి కానుందని పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దివ్యా ఒబెరాయ్ చెప్పారు. మళ్లీ ఇలాంటిది చూడాలంటే 2028 డిసెంబరు 31 వరకూ వేచి చూడాలన్నారు. ఈ నెల 7,8 తేదీల (ఆది, సోమవారం) మధ్య ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని వెల్లడించారు. ఆదివారంరాత్రి 8:58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 8వ తేదీ తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్ర గ్రహణం ముగుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ