అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాలంటూ పవన్ ను స్వయంగా ఆహ్వానించారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో మంత్రి నిమ్మల సతీసమేతంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా, ఈ నెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరగనున్న తన కుమార్తె శ్రీజ వివాహ వేడుకకు రావాలని కోరుతూ పవన్ కల్యాణ్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ భేటీ ఎంతో ఆత్మీయంగా సాగింది.
ఈ విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పవన్ కల్యాణ్ ను తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి