అమెరికా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ,5 సెప్టెంబర్ (హి.స.) ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం ముగిసినట్లుగా భావిస్తున్నట్లు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ స్పష్టం చేశారు. బ్రిటిష్ మీడియా పోర్టల్ ఎల్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడారు.
THREE LEADERS


న్యూఢిల్లీ,5 సెప్టెంబర్ (హి.స.) ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం ముగిసినట్లుగా భావిస్తున్నట్లు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ స్పష్టం చేశారు. బ్రిటిష్ మీడియా పోర్టల్ ఎల్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడారు. ట్రంప్ సుంకాలు కారణంగానే దశాబ్దాలు నాటి అమెరికా-భారత్ బంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు ట్రంప్-మోడీ మధ్య బలమైన సంబంధాలు ఉండేవని.. ఇప్పుడు కనుమరుగైపోయిందని తెలిపారు. సుంకాలు కారణంగా దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఒక్కసారిగా వెనక్కి పోయిందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడైతే ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధం ఉండేదని.. ప్రస్తుతం అయితే ఆ బంధం లేదనే భావిస్తున్నట్లు తెలిపారు. ఇది అందరికీ ఒక పాఠం అని చెప్పారు. ఇక చైనాలో జరిగిన ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో రష్యా, చైనా నాయకులతో ప్రధాని మోదీ కూడా ఉండటంపై ఆయన స్పందిస్తూ.. ప్రపంచ క్రమం మారుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. సుంకాలు కారణంగానే ఇదంతా జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా వార్‌లోకి భారత్‌ను లాగడంతోనే ఈ తంటాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande