స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్‌ మార్కెట్లు
ముంబయి:/న్యూఢిల్లీ,5 సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నప్పటికీ.. మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు (Stock Mar
స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్‌ మార్కెట్లు


ముంబయి:/న్యూఢిల్లీ,5 సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నప్పటికీ.. మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు (Stock Market).. తర్వాత ఆ జోరు తగ్గించాయి.

ఈ ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 300 పాయింట్లకు పైగా లాభంతో, నిఫ్టీ 24,800 మార్క్‌ పైన ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అయితే, కాసేపటికే లాభాల్లో కొంత ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 193.34 పాయింట్ల లాభంతో 80,911.35 వద్ద, నిఫ్టీ (Nifty) 55.45 పాయింట్లు పెరిగి 24,789.75 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.13గా కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande