నిజమైన జీఎస్టీ 2.0 కోసం వేచిచూడాలి
న్యూఢిల్లీ,5 సెప్టెంబర్ (హి.స.): వస్తుసేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలను జీఎస్టీ 1.5గా అభివర్ణించిన కాంగ్రెస్‌.. నిజమైన జీఎస్టీ 2.0 కోసం వేచి చూడాల్సి ఉందని అభిప్రాయపడింది. 2024-25 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని ఐదేళ్లపాటు అన్ని రాష్ట్రాలకు పరిహారం ఇవ్వా
GST Reforms


న్యూఢిల్లీ,5 సెప్టెంబర్ (హి.స.): వస్తుసేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలను జీఎస్టీ 1.5గా అభివర్ణించిన కాంగ్రెస్‌.. నిజమైన జీఎస్టీ 2.0 కోసం వేచి చూడాల్సి ఉందని అభిప్రాయపడింది. 2024-25 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని ఐదేళ్లపాటు అన్ని రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని డిమాండు చేసింది. జీఎస్టీ రేట్లు తగ్గడంవల్ల రాష్ట్రాల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. జీఎస్టీని సరళీకరించాలని పదేళ్లుగా తాము డిమాండు చేస్తున్నామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ నెల 22 నుంచి 5, 18 శాతాల శ్లాబులను తీసుకొస్తున్నామన్న ఎన్డీయే ప్రభుత్వ ప్రకటనపై ఆయన స్పందించారు. ఒకే దేశం, ఒకే పన్నును మోదీ ప్రభుత్వం ఒకే దేశం, 9 పన్నులుగా మార్చిందని విమర్శించారు. ఇందులో 0%, 5%, 12%, 18%, 28% పన్ను శ్లాబులుండగా 0.25%, 1.5%, 3%, 6% ప్రత్యేక రేట్లున్నాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande