తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలాపూర్ లడ్డు.వేలం. పాట ఘనంగా ముగిసింది
హైదరాబాద్‌, 6 సెప్టెంబర్ (హి.స.) : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ఘనంగా సాగింది. ఈ సారి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. దీన్ని కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్‌ అనే వ్యక్తి రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. వే
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలాపూర్ లడ్డు.వేలం. పాట ఘనంగా ముగిసింది


హైదరాబాద్‌, 6 సెప్టెంబర్ (హి.స.)

: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ఘనంగా సాగింది. ఈ సారి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. దీన్ని కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్‌ అనే వ్యక్తి రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. గతేడాది ఈ లడ్డూను రూ.30.01 లక్షలకు కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాదికంటే ఈసారి లడ్డూ ధర రూ.4.99 లక్షలు అధికంగా పలికింది.

లడ్డూ విజేత దశరథగౌడ్‌ను ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సన్మానించింది. ‘బాలాపూర్‌ లడ్డూ అంటే నాకు చాలా ఇష్టం. ఆరేళ్లుగా దీని కోసం ప్రయత్నిస్తున్నా. ఇన్నేళ్ల తర్వాత బాలాపూర్‌ లడ్డూ దక్కింది. ఎంతో సంతోషంగా ఉంది’’ అని దశరథగౌడ్‌ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande