హైదరాబాద్6 సెప్టెంబర్ (హి.స.)
: ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల మధ్య మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. రాజ్‌ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మార్గ్‌లో నాలుగో నంబరు స్టాండులో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అక్కడ బాహుబలి క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కోసం పోలీసులు భారీబందోబస్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ