ముంబై నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి
ముంబై , 6 సెప్టెంబర్ (హి.స.)మహా నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ముంబై రోడ్లు గణేశుల శోభాయాత్రతో కిక్కిరిసిపోయాయి. నేడు (శనివారం) పెద్ద సంఖ్యలో బొజ్జ గణపయ్యలు గంగమ్మను చేరనున్నారు. వినాయక నిమజ్జనాలకు సంబంధించి బీఎంసీ కట్టుదిట్ట
ముంబై నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి


ముంబై , 6 సెప్టెంబర్ (హి.స.)మహా నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ముంబై రోడ్లు గణేశుల శోభాయాత్రతో కిక్కిరిసిపోయాయి. నేడు (శనివారం) పెద్ద సంఖ్యలో బొజ్జ గణపయ్యలు గంగమ్మను చేరనున్నారు. వినాయక నిమజ్జనాలకు సంబంధించి బీఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. వినాయకుల నిమజ్జనం కోసం కొన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సముద్రంతో పాటు చెరువులు, నీటి కుంటలు, కృత్తిమంగా తయారు చేసిన కుంటల్లో వినాయకులను నిమజ్జనం జరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande