టారిఫ్‌ల వేళ.. ఐరాస సమావేశానికి మోదీ దూరం
న్యూఢిల్లీ,06,సెప్టెంబర్ (హి.స.)భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జరగనున్న ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని మోదీ (PM Modi) హాజరు కావడం లేదని తెలుస్తోంది. స
PM Narendra Modi Addressing the gathering


న్యూఢిల్లీ,06,సెప్టెంబర్ (హి.స.)భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జరగనున్న ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని మోదీ (PM Modi) హాజరు కావడం లేదని తెలుస్తోంది.

సెప్టెంబరు 9 నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 80వ సెషన్‌ (UNGA session) ప్రారంభమవుతుంది. 23 నుంచి 29 వరకు సర్వసభ్య దేశాల ప్రతినిధుల అత్యున్నత స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో బ్రెజిల్‌ దేశాధినేత ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అనంతరం అమెరికా అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మాట్లాడతారు. తర్వాత భారత మంత్రి ప్రసంగం ఉంటుందని ఐరాస తన షెడ్యూల్‌లో పేర్కొంది. దీని ప్రకారం యూఎన్‌ సమావేశాలకు మోదీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రసంగించనున్నారని సమాచారం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande