హైదరాబాద్:, 6 సెప్టెంబర్ (హి.స.)వినాయక చవితి అంటే చాలు హైదరాబాద్‌లో జరిగే శోభాయాత్రలు, లడ్డూ వేలం పాటలే ఎక్కువగా గుర్తొస్తాయి. ఇక వినాయక లడ్డూ అంటేస్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.అందరికీబాలాపూర్ గణేశ్ లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది.ఎందుకంటే దశాబ్ధాల కాలం నుండి బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకుతూ వస్తుంది. అయితే, ఈ సారి మాత్రంరాజేంద్రనగర్‌లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట..బాలాపూర్ గణేశ్ లడ్డూ చరిత్రను తిరగరాసింది.ఏకంగా రూ.2.32 కోట్లకు వేలం పాట పలికిరికార్డుగా నిలిచిందని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ