న్యూఢిల్లీ,06,సెప్టెంబర్ (హి.స.)మహారాష్ట్రలోని శిర్డీ సాయిబాబా ఆలయానికి దుబాయికి చెందిన ఓ భక్తుడు రూ.1.58 కోట్ల విలువైన కానుక సమర్పించారు. 1.6 కిలోల బంగారంతో రూపొందించిన ‘ఓం సాయి రామ్’ అక్షరాలను గురువారం అందజేశారు. తన వివరాలు బహిర్గతం చేయవద్దని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఆలయంలోని రెండు ప్రధాన ద్వారాలకు వీటిని అమర్చారు. ఈ భక్తుడి కుటుంబం ప్రతినెలా శిర్డీ సాయినాథుడి దర్శనం చేసుకొని.. రూ.లక్ష విరాళంగా ఇస్తున్నట్లు సాయిబాబా సంస్థాన్ సీఈవో గోరక్ష్ గడిల్కర్ తెలిపారు. 2008లో ఓ భక్తుడు బాబాకు దాదాపు 100 కిలోల బంగారు సింహాసనాన్ని విరాళంగా ఇచ్చారని.. దాని తర్వాత ఇదే అంత విలువైన విరాళమని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ