ట్రైన్‌లో కవలలకు జన్మనిచ్చిన మహిళ
శ్రీకాకుళం, 6 సెప్టెంబర్ (హి.స.)విశాఖకు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ (Konark Express) లో ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంకు చెందిన గర్భిణి భూ లక్ష్మి, భర్త జానకిరామ్ తో కలిసి విశాఖ వెళ్లేందుకు ఇచ్ఛాపురంలో శుక్రవారం రా
/woman-gives-birth-to-twins-on-train-472515


శ్రీకాకుళం, 6 సెప్టెంబర్ (హి.స.)విశాఖకు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ (Konark Express) లో ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంకు చెందిన గర్భిణి భూ లక్ష్మి, భర్త జానకిరామ్ తో కలిసి విశాఖ వెళ్లేందుకు ఇచ్ఛాపురంలో శుక్రవారం రాత్రి కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. ట్రైన్ రన్నింగ్ లో ఉండగా ఆమెకు పురిటినొప్పులు రాగా.. భర్త జానకిరామ్ ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సిబ్బంది అప్రమత్తం చేసి రైలును ఆపారు. అప్పటికే డాక్టర్ పల్లవి కీర్తి అక్కడకు చేరుకున్నారు.

భూలక్ష్మి ఆరోగ్యాన్ని పరీక్షించిన డాక్టర్.. రైలులోనే కాన్పు చేయగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి,పిల్లలు ఆరోగ్యంగానే ఉండగా వారికి మెరుగైన వైద్యం కోసం రాగోలు జీఏఎంఎస్ కు తరలించారు. తన భార్యకు సకాలంలో కాన్పు జరిగేలా సహాయం చేసిన ఆర్పీఎఫ్ సిబ్బంది, డాక్టర్, రైల్వే సిబ్బందికి భూ లక్ష్మి భర్త కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande