యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం
కాశీ విశ్వనాథ ఆలయ పూజారులు, సిబ్బందికి 3 రెట్లు జీతం పెంచుతూ నిర్ణయం
Cm yogi


ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి హోదాతో పాటు 3 రెట్లు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీతాలతో పాటు అదనంగా అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో కాశీ విశ్వనాథ ఆలయ ఉద్యోగులంతా ఉత్తరప్రదేశ్‌లోని ఇతర వర్గాల ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉంటారని వెల్లడించింది.

ప్రస్తుతం పూజారులకు, ఉద్యోగులకు నెలకు రూ.30,000 అందుతున్నాయి. ఇప్పుడు ఈ జీతాలు మూడు రెట్లు పెంచారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఇంత స్థాయిలో జీతాలు పెంచడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాశీ విశ్వనాథ్ ఒకటిగా ఉంది. 1983లో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పరిపాలనను చేపట్టింది. ఆనాటి నుంచి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. యోగి సర్కార్ నిర్ణయం కీలక మార్పు చోటుచేసుకుంది.

గురువారం సాయంత్రం కమిషనర్ కార్యాలయంలో జరిగిన 108వ సమావేశంలో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ ఈ ప్రతిపాదనలను ఆమోదించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande