సంక్రాంతికి మరో 3 ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు, 12 జనవరి (హి.స.) సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో 3 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తా
/3-more-special-trains-for-sankranti-513290


గుంతకల్లు, 12 జనవరి (హి.స.)

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో 3 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జనవరి 18న ఒక ట్రైన్, 19న మరో ట్రైన్ రాత్రి 10.30 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటాయి. అలాగే 19న రాత్రి 12.40 గంటలకు ఒక ట్రైన్ చర్లపల్లి నుంచి అనకాపల్లికి బయలుదేరనుంది. ఇప్పటికే ఈ రూట్‌లో నడుస్తున్న రెగ్యులర్ రైళ్లు ముందుగానే ఫుల్ కావడంతో, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉండటంతో అదనపు రైళ్లు ఏర్పాటు చేశారు.

ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి మీదుగా నడుస్తాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి వంటి కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటికే SCR 150కు పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. రెగ్యులర్ తో కలిపి మొత్తం 600కు పైగా రైళ్లు పండగ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande