
హైదరాబాద్, 12 జనవరి (హి.స.)
ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై
అసత్య, నిరాధారమైన వార్తలను ప్రసారం కావడం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇలాంటి తప్పడు వార్తలపై తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐపీఎస్ అసోషియేషన్ తీవ్రంగా ఖండించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐఏఎస్ అసోసియేషన్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఎన్టీవీ యాజమాన్యం, పలు ఇతర సోషల్ మీడియా ఛానల్లపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
జనవరి 8న ఎన్టీవీలో ప్రసారమైన ఒక వార్తా కథనంలో, ఒక మహిళా ఐఏఎస్ అధికారికి రాజకీయ నాయకులతో సంబంధం ఉందని, ఆమెకు వచ్చిన పోస్టింగ్లు (పదోన్నతులు) ఈ ప్రభావంతోనే వచ్చాయని పరోక్షంగా ఆరోపించారు. ఈ కథనంలో ఆమె పేరు ప్రస్తావించనప్పటికీ, ఆమె గతంలో నల్గొండ కలెక్టర్గా, ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారని పేర్కొంటూ ఆమె గుర్తింపును పరోక్షంగా వెల్లడించారని, ఇది ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, ఆమె నైతికతను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు