సినిమా చూస్తూ ప్రాణాలు విడిచిన చిరంజీవి అభిమాని
హైదరాబాద్, 12 జనవరి (హి.స.) మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూస్తూ తాను కూర్చున్న సీట్ లోనే ప్రాణాలు వదిలాడు ఓ అభిమాని. ఈ విషాదకర ఘటన కేపీహెచ్ బీ పోలీసు స్టేషన్ పరిధిలోని అర్జున్ థియేటర్ లో సోమవారం చోటు చేసుకుంది. సినిమా
చిరంజీవి అభిమాని


హైదరాబాద్, 12 జనవరి (హి.స.)

మెగాస్టార్ చిరంజీవి నటించిన

మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూస్తూ తాను కూర్చున్న సీట్ లోనే ప్రాణాలు వదిలాడు ఓ అభిమాని. ఈ విషాదకర ఘటన కేపీహెచ్ బీ పోలీసు స్టేషన్ పరిధిలోని అర్జున్ థియేటర్ లో సోమవారం చోటు చేసుకుంది. సినిమాను చూసేందుకు 12వ బెటాలియన్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఏఎస్ఐ ఆనంద్ కుమార్ సోమవారం ఉదయం 11: 30 గంటల షోకి వెళ్లారు. అయితే సినిమా చూస్తున్న సమయంలోనే తాను కూర్చున్న సీట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన తోటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande