
అమరావతి, 12 జనవరి (హి.స.)అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు (సెక్రటరీలు), విభాగాధిపతులతో జరిగిన కీలక సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ( ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు సరిగా ఖర్చు చేయకపోవడంపై మండిపడ్డారు. ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. ఈనెల (జనవరి) 15వ తేదీ డెడ్‌లైన్‌గా ఇచ్చినా ఎందుకు ఖర్చు చేయడం లేదని సీఎం నిలదీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ