
హైదరాబాద్, 12 జనవరి (హి.స.)
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమిండియా కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీకి చెందిన యువ బ్యాటర్ ఆయుష్ బదోని ని జట్టులోకి తీసుకుంటున్నట్లగా అధికారికి ప్రకటన విడుదలైంది. ఇక ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున, అలాగే దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టు తరపున బదోని నిలకడగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా బెస్ట్ ఫినిషర్గా, ఆఫ్ స్పిన్నర్గా రెండో వన్డే నాటికి బదోని జట్టుతో చేరునున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..