
అమరావతి, 12 జనవరి (హి.స.)
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సమతుల్యంగా నడిపించేందుకు 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ జారీ చేశారు. ఈ మార్పులు జిల్లాస్థాయి పరిపాలనా శాఖల్లో కీలక బాధ్యతలను పునర్విభజన చేసేలా ఉన్నాయి. ఈ బదిలీల్లో పలు ముఖ్యమైన మార్పులు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ