
హైదరాబాద్, 12 జనవరి (హి.స.)
తెలంగాణ జైళ్ల శాఖ-2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే జైలు అడ్మిషన్లలో 11.8 శాతం వృద్ధి నమోదైందని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్ర వెల్లడించారు. సోమవారం చంచల్గూడలో ప్రిసెన్స్ అకాడమీలో ఆమె తెలంగాణ జైళ్ల శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ.. ముఖ్యంగా సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు. 2024లో 34,811 మంది ఖైదీలు ఉండగా .. 2025లో 36,627 మంది ఖైదీలు పెరిగారని తెలిపారు. ఇక సివిల్ కేసుల్లో 20 మంది ఖైదీలుగా జైళ్లకు వచ్చాయని వెల్లడించారు. ఇక సైబర్ నేరాలు అత్యధికంగా 135.6 శాతం పెరిగాయని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు