
పెద్దపల్లి, 12 జనవరి (హి.స.)
ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులపై దుష్ప్రచారం సరికాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ విషయంలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నానన్నారు. ప్రభుత్వంలో ఎంతో నిష్పక్షపాతంగా పని చేస్తిన్న అధికారులు, ప్రభుత్వ పెద్దలపై తప్పుడు ప్రచారం మంచి కల్చర్ కాదని దయచేసి ఇలాంటివి ప్రచారం చేయొద్దని మీడియా సంస్థలకు సోషల్ మీడియా హ్యాండిల్స్ కి విజ్ఞప్తి చేశారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు