
విశాఖపట్నం/నెల్లూరు , 12 జనవరి (హి.స.)
, శ్రీలంకలో తీరందాటిన వాయుగుండం దక్షిణ తమిళనాడు పరిసరాల్లోకి వచ్చిన తర్వాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. ప్రస్తుతం ఇది దక్షిణ తమిళనాడు, గల్ఫ్‌ఆఫ్ మన్నార్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం తమిళనాడులో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, సీమల్లో చెదురుమదరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో పొడివాతావరణం నెలకొంటుందని, పలుచోట్ల పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ