సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన.బకాయిలు ప్రభుత్వం.చెల్లి చింది
అమరావతి, 14 జనవరి (హి.స.)సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం ఇవాళ (బుధవారం) చెల్లించింది. దీంతో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమవుతోంది. దాంతో ఆయా ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస
సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన.బకాయిలు ప్రభుత్వం.చెల్లి చింది


అమరావతి, 14 జనవరి (హి.స.)సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం ఇవాళ (బుధవారం) చెల్లించింది. దీంతో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమవుతోంది. దాంతో ఆయా ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. అలాంటి వేళ ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పందించారు. పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను ప్రభుత్వం విడుదల చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి సంక్రాంతి పండుగను తామందరం చాలా సంతోషంగా జరుపుకుంటామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande