
తిరుమల:, 15 జనవరి (హి.స.) చైన్నెకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ బుధవారం వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ