చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) తనకున్న భూసమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే.. సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నార
చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం


చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) తనకున్న భూసమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే.. సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రుయాకు తరలించారు.

7

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande