
హైదరాబాద్: , 15 జనవరి (హి.స.)ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆసుపత్రి మాజీ ఎండీపై 14 మంది సీనియర్ డాక్టర్ల ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి మాజీ ఎండీపై కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో రూ.38 కోట్లకు పైగా మోసం చేశారంటూ ఎండీపై ఆరోపణలు ఉన్నాయి
ప్లాస్టిక్ సర్జన్ డా. చొక్కా రాజేష్ వాసు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2014–2015 మధ్య ఆసుపత్రి ఈక్విటీ పేరిట పెట్టుబడులు పెట్టగా.. మొత్తం రూ.100 కోట్ల మేరకు డాక్టర్ల నుంచి నిధుల సమీకరణ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు చేసిన 14 మంది డాక్టర్ల పెట్టుబడి రూ.38 కోట్లకు పైగా ఉన్నట్లుpilgrim rush tirumala తెలుస్తోంది. హామీ ఇచ్చిన లాభాలు ఇవ్వకుండా మభ్యపెట్టినట్టు డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ