రాజ్యాంగాన్ని రాహుల్ – రేవంత్ పరిహాసం చేస్తున్నారు.. కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, 16 జనవరి (హి.స.) ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని.. వారిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించ
కేటీఆర్


హైదరాబాద్, 16 జనవరి (హి.స.)

ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని.. వారిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్న రాహుల్ – రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ, తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటిచెప్పిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande