
అమరావతి, 16 జనవరి (హి.స.):కనుమ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చే కనుమ అనేది రైతు జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ అని ఆయన పేర్కొన్నారు. తమ వ్యవసాయానికి సహకరిస్తున్న పశువుల పట్ల కృతజ్ఞత వ్యక్తపరచే రోజు కనుమ అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ