ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. జోగు రామన్న హౌస్ అరెస్టు
ఆదిలాబాద్, 16 జనవరి (హి.స.) ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్టు చేశారు. జోగు రామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఇలా బీఆర్
జోగు రామన్న హౌస్ అరెస్ట్


ఆదిలాబాద్, 16 జనవరి (హి.స.)

ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్టు చేశారు. జోగు రామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఇలా బీఆర్ఎస్ నేతల అరెస్టులో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చనాకా కొరాటా ప్రాజెక్టు ట్రయల్ రన్కు రావడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి 50 వేల ఎకరాలకు నీరు అందించాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి రైతులకు సంకల్పంతో కృషి చేశారని తెలిపారు. కానీ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్క ఎకరాకు కూడా అందించకుండా ట్రయల్ రన్ చేయడం, దాన్ని ప్రారంభించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande