
నిర్మల్, 14 జనవరి (హి.స.)
భైంసా పట్టణంలోని వివిధ కాలనీల్లో
తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు యూ.ఐ.డి.ఎఫ్ (UIDF) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సహకారంతో మొత్తం రూ.28 కోట్ల నిధులు విడుదలైనట్టు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులతో పట్టణ వ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేస్తామని అన్నారు. కొత్త పైప్లాన్ల ఏర్పాటు, నీటి ట్యాంకుల నిర్మాణం ద్వారా ప్రతి కాలనీకి నిరంతర తాగునీటి సరఫరా అందించనున్నట్లు వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..