సంక్రాంతి వేళ ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 20 మంది ప్రయాణికులకు గాయాలు
మహబూబ్నగర్, 14 జనవరి (హి.స.) సంక్రాంతి వేళ ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు
ప్రమాదం


మహబూబ్నగర్, 14 జనవరి (హి.స.)

సంక్రాంతి వేళ ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి పెబ్బేరు మీదుగా కర్నూలు వెళ్తున్న కొల్లాపూర్ డిపో బస్సు మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో డ్రైవర్తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

యాక్సిడెంట్ కారణంగా కర్నూలు వైపు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande