
హైదరాబాద్, 14 జనవరి (హి.స.)
ఐఏఎస్ అధికారిణిపై అవాస్తవాలను
ప్రచారం చేసిన కేసులో తెలంగాణలో వరుస అరెస్టులు జరగడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు చేపట్టడం మనం చూస్తున్నాం. పాలన, పోలీసింగ్, సైన్స్, మీడియా వంటి రంగాలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా వారు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే, విమర్శ పేరుతో మహిళా అధికారులను, ఉద్యోగినులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో వారి వ్యక్తిత్వాన్ని కించపరచడం విమర్శ కాదని, అది ముమ్మాటికీ క్రూరత్వమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..