వాళ్లేం టెర్రరిస్టులు కాదు.. జర్నలిస్టుల అరెస్టుపై డీజీపీతో ఫోన్లో హరీశ్రావు
హైదరాబాద్, 14 జనవరి (హి.స.) ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ల అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడారు. పండుగ సమయంలో అర
హరీష్ రావు


హైదరాబాద్, 14 జనవరి (హి.స.)

ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేశ్,

రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ల అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడారు. పండుగ సమయంలో అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్టులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు.

ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని డీజీపీ శివధర్ రెడ్డిని హరీశ్రావు ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు టెర్రరిస్టులు కాదు? వారిపట్ల ఎందుకు అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అడిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande