
హైదరాబాద్, 14 జనవరి (హి.స.)
మహిళా ఐఏఎస్ అధికారిపై ఆరోపణల కేసులో ఊహించని ట్విస్ట్ నమోదైంది. కుటుంబంతో విదేశాలకు వెళుతున్న NTV ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే చానల్కు చెందిన మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వాళ్ళను ఎక్కడ ఉంచారో చెప్పకుండా నేరుగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేలా ప్లాన్ చేస్తున్నట్టు టీవీ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. పండగ పూట రిపోర్టర్ల అరెస్టు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పరిణామాలతో ఛానల్ యజమాన్యం నరేంద్ర చౌదరి, సీఈవో రాజశేఖర్ అజ్ఞాతంలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..