
హైదరాబాద్, 14 జనవరి (హి.స.)
రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల్ని
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని విమర్శించారు. నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అర్ధరాత్రివేళ అరెస్టులు చేయడం సరికాదని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మీడియాపై దమనకాండ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సైతం ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గారు.. మీరు నడుపుతోన్న మొహబ్బత్ కీ దుకాన్ తెలంగాణశాఖ పౌరుల రాజ్యాంగ హక్కుల్ని ఎలా కాలరాస్తుందో చూస్తున్నారని ఆశిస్తున్నాని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..