
తెలంగాణ, 14 జనవరి (హి.స.)
రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది. కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలి పోవాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. బోగి పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన బోగి మంటల వేడుకలో పాల్గొని అందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపి మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి అంటే రైతుల పంటల పండుగ.పతంగులతో చిన్నారులు, ముగ్గులతో మహిళలు మురిసే పండుగ అన్నారు. బోగిమంటల్లో అందరి చెడు ఆలోచనలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు తగు జాగ్రత్తలు పాటిస్తూ పతంగులు ఎగుర వేయాలని సూచించారు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు