
నిర్మల్, 14 జనవరి (హి.స.)
సీఎం పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జనవరి 16 న జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదిక, వీఐపీ గ్యాలరీ, సభకు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు