.గుంటూరు జిల్లా తుళ్లూరులో పండుగంరోజున రెండు కుటుంబాల్లో.విషాదం
అమరావతి, 14 జనవరి (హి.స.) తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో పండుగ రోజున రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. తుళ్లూరుకు చెందిన బుద్ధ మార్క్‌, బురడ సాంబయ్యలు నూతన బైపాస్‌ మీదుగా విజయవాడ వెళ్తుండగా.. అటువైపు నుంచి వస్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. ఈ
.గుంటూరు జిల్లా తుళ్లూరులో పండుగంరోజున రెండు కుటుంబాల్లో.విషాదం


అమరావతి, 14 జనవరి (హి.స.)

తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో పండుగ రోజున రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. తుళ్లూరుకు చెందిన బుద్ధ మార్క్‌, బురడ సాంబయ్యలు నూతన బైపాస్‌ మీదుగా విజయవాడ వెళ్తుండగా.. అటువైపు నుంచి వస్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. రాంగ్‌ రూట్‌లో వచ్చి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande