
అమరావతి, 14 జనవరి (హి.స.)
కుప్పం,: సంస్కృతి, సంప్రదాయలు చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి పండగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా పాల్గొంటున్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు భార్య భువనేశ్వరితో సహా కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఇక బుధవారం భోగి పండగ వేళ.. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినీ, శ్రీభరత్ దంపతుల పిల్లలు ఎద్దుల బండిలో ఊరేగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ