ఎపి వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు
అమరావతి, 14 జనవరి (హి.స.) అమరావతి ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు( అంబరాన్నంటాయి. మూడు రోజుల సంక్రాంతి పండుగలో తొలిరోజు భోగి సంబరాలు వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటి ముంగిళ్లలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసుకుంటూ ఆట
ఎపి వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు


అమరావతి, 14 జనవరి (హి.స.)

అమరావతి ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు( అంబరాన్నంటాయి. మూడు రోజుల సంక్రాంతి పండుగలో తొలిరోజు భోగి సంబరాలు వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటి ముంగిళ్లలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు రాష్ట్ర ప్రజలు. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు. అలాగే భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా భోగి సంబరాల్లో పాలుపంచుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande