పాలమూరుకు ద్రోహంతో బీఆర్ఎస్కు డిపాజిట్లు రాలేదు. మంత్రి కోమటిరెడ్డి
మహబూబ్నగర్, 14 జనవరి (హి.స.) పదేళ్ల పాలనలో పాలమూరుకు ద్రోహం చేశారు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సెటైర్లు వేశారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో మంత్రి వాకిటి శ్రీహరితో కలి
మంత్రి కోమటిరెడ్డి


మహబూబ్నగర్, 14 జనవరి (హి.స.)

పదేళ్ల పాలనలో పాలమూరుకు ద్రోహం

చేశారు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సెటైర్లు వేశారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన రూ.25 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రూ.80 వేల కోట్ల అంచనా ఉన్న ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తే.. ప్రాజెక్టు 90 శాతం ఎలా పూర్తి అవుతుందని ప్రశ్నించారు. పాలమూరుకు ద్రోహం చేశారు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande